calender_icon.png 15 November, 2024 | 10:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ ఆస్తుల బదిలీ నిలిపివేత

11-11-2024 12:28:28 AM

రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో నిర్ణయం

బెంగళూరు, నవంబర్ 10: కర్నాటకలో వక్ఫ్ చట్టంలో సవరణ కోసం వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకున్న భూముల రిజిస్ట్రేషన్‌ను తక్షణమే నిలిపివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులు, ప్రైవేట్ యజమానుల నుంచి వక్ఫ్ బోర్డుకు బదిలీ చేసిన అన్ని ఆస్థుల మ్యూటేషన్ ప్రక్రియలను నిలిపివేసిన ప్రభుత్వం..

తొలగింపు నోటీసులు జారీ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కర్నాటక బోర్డ్ ఆఫ్ వక్ఫ్‌కు అనుకూలంగా ఆస్తి యాజమాన్యాన్ని ఏకపక్షంగా బదిలీ చేయడంపై ఇటీవల పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయన్న రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ఆయా ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించారు.

మ్యుటేషన్ రికార్డులను మార్చడానికి గతంలో ఏదైనా ప్రభుత్వ కార్యాలయం లేదా అధికారి జారీచేసిన అన్ని ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు సీఎం స్పష్టం చేశారు.  కాగా వక్ఫ్ చట్టానికి సవరణ కోసం బోర్డు క్లెయిమ్ చేస్తున్న భూములను హడావుడిగా రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కర్ణాటక బీజేపీ నేత, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక గతవారం ఆరోపించారు.

అయితే నవంబర్ 13న మూడు కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్లకు ఉప ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో రైతుల భూముల మ్యుటేషన్ ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చకు దాదితీసింది.