calender_icon.png 20 November, 2024 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరుగురు కార్యదర్శుల సస్పెన్షన్

20-11-2024 02:22:32 AM

ఆకస్మిక తనిఖీలో పెద్దపల్లి కలెక్టర్ చర్యలు

మంథని, నవంబర్ 19 (విజయక్రాంతి): విధుల్లో నిర్లక్ష్యం చేసిన ఆరుగురు పంచాయతీ కార్యదర్శులను పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం సస్పెండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ముత్తారం మండలంలో అధికారులు సమయపాలన పాటించడం లేదని వస్తున్న ఫిర్యాదులతో మంగళవారం మండల పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ ఉదయం 11.30 గంటలకు ఆకస్మిక తనిఖీ చేశారు.

అనుమతి లేకుండా సిబ్బంది విధులకు గైర్హాజరైన ట్టు గమనించారు. గతంలోనే వారు విధులకు సరిగా హాజరుకాకపోవడంతో కలెక్టర్ మెమోలు కూడా జారీ చేశారు. ఆయినప్పటికీ పద్ధతి మార్చుకోకపోవడంతో ఆరుగు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు.