నిజామాబాద్ జిల్లాలో పనిచేసిన సమయంలో సహకరించారని ఆరోపణలు
పట్టుబడిన స్మగ్లర్లు విచారణలో వెల్లడి
నిజామాబాద్ జిల్లాలోని పోలీస్ అధికారులలో అలజడి
కామారెడ్డి, (విజయ క్రాంతి): గంజాయి స్మగ్లర్ సహకరించిన ఎస్సై, ఏ ఎస్ ఐ లను పోలీసు ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లోని మద్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా పనిచేసిన అంబార్యా, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ మారుతి నాయక్, ఏఆర్ కానిస్టేబుల్ మదులు సస్పెండ్ చేస్తూ ఐజి సత్యనారాయణ శుక్రవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం ఎస్సై అంబా రి య పటాన్చెరువు ఎస్ఐగా పనిచేస్తున్నారు.
మద్నూర్ ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో అంబా రీ య సలాబత్పూర్ చెక్పోస్ట్ వద్ద ప ట్టుబడ్డ గంజాయి స్మగ్లర్లను లను విడిచి పెట్టారని పోలీసుల విచారణలో స్మగ్లర్ లు పేర్కొనడంతో పోలీసు ఉన్నతాధికారులు అంబార్యా, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ మారుతి నాయక్,ఏఆర్ కానిస్టేబుల్ మధు లను సస్పెండ్ చేశారు. ఈ సంఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నీ పోలీస్ శాఖలో అలజడి సృష్టించింది. ఉమ్మడి జిల్లాకు చెందిన 11 మంది పోలీస్ అధికారులు అక్రమ ఇసుక దందా నిర్వహిస్తున్న స్మగ్లర్లకు సహకరించారని ఆరోపణలపై పోలీసు ఉన్నత అధికారులు మెమోలోల ను జారీ చేసిన విషయం విధితమే. వారి మెడకు కూడా సస్పెన్షన్ వేటు పడుతుందని ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలోని పోలీస్ శాఖలో ఎస్సై ఏ ఎస్ ఐ కానిస్టేబుల్ సస్పెన్షన్ కలకలం రేపు తుంది.