calender_icon.png 23 December, 2024 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాజీ విగ్రహావిష్కరణ నిలిపివేత

09-09-2024 12:00:00 AM

ఎల్బీనగర్, సెప్టెంబర్ 8: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలకుంట చెక్‌పోస్టులో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ ను శనివారం పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో.. పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ, బీజేవైఎం నాయకులు విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అయితే ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్ హాజరవుతారనే సమాచారం. అనుమతులు ఉంటే తాము ఎందుకు అడ్డుకుంటామని.. ముందుగా నాయకులు విగ్రహ ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని పోలీసులు సూచించారు.