భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 25(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక తహసీల్దార్ టి సూర్యనారాయణను బుధవార ం కలెక్టర్ జితేష్ వి పాటిల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏజె న్సీ చట్టాలకు విరుద్ధంగా భూమి ప ట్టా మార్పిడికి పాల్పడినట్టు మండ ల పరిధిలోని కంది బ్రహ్మారెడ్డి అనే రైతు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు జరిపిన విచారణలో నిజమేనని తే లడంతో సస్పెషన్ వేటు పడింది. కాగా ఆయన పదవీ విరమణకు మ రో 8 నెలలు మాత్రమే గడువు ఉండటం గమనార్హం.