calender_icon.png 21 September, 2024 | 6:11 PM

హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్

26-07-2024 01:27:38 AM

అంధ బాలికపై లైంగిక దాడి ఘటనలో కలెక్టర్ చర్యలు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (విజయక్రాంతి)/మలక్‌పేట: మలక్‌పేటలోని ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్‌లో మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలికపై స్కా వెంజర్ లైంగిక దాడి చేసిన  ఘటనపై హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ కన్నెర్రజేశారు. హాస్టల్ ఇన్‌చార్జ్ వార్డెన్ స్వప్నను గురువారం సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణ జరపడానికి ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం నిజ నిర్ధారణ కమిటీని నియమించిందని కలెక్టర్ తెలిపారు. ఈ కమిటీ చైర్మన్‌గా దివ్యాంగుల సాధికారత శాఖ డైరెక్టర్, కమిషనర్ బీ శైలజ, కమిటీ సభ్యులుగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆశన్న, దివ్యాంగుల సాధికారత శాఖ సహాయ సంచాలకుడు ఏ రాజేందర్‌ను నియమించినట్లు చెప్పారు.

కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కాగా, లైంగిక దాడి ఘటనపై అధికార యంత్రాంగం విచారణ చేపట్టారు. రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ సంచాలకురాలు శైలజ, జిల్లా ఏడీ రాజేందర్ గురువారం హాస్టల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ అధికారులు, విద్యార్థినులతో మాట్లాడారు. ఘటనపై ఆరా తీశారు. కాగా, హాస్టల్‌ను సందర్శించిన అధికారుల ను అంధ బాలికలు చుట్టుముట్టారు. ఈ నెల 7న ఘటన జరిగితే ఇప్పటివరకు గోప్యంగా ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

మంత్రి సీతక్క ఆగ్రహం

లైంగిక దాడి ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షే మ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహం వార్డెన్‌ను వెంట నే సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై అధికారుల నుంచి నివేదిక కోరారు. ఘట నతో సంబంధం ఉన్న, విధుల పట్ల అలసత్వం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడికి కఠిన శిక్ష పడేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.