calender_icon.png 24 January, 2025 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌ఎంల సస్పెన్షన్ ఎత్తివేయాలి

22-10-2024 01:31:54 AM

డీఎస్‌ఈ డైరెక్టర్‌కు హెచ్‌ఎం సంఘం వినతి

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): గతంలో చేపట్టిన సాధారణ బదిలీ సమయంలో స్పౌజ్ పాయింట్లు దుర్వినియోగం చేశారనే నేపథ్యంలో సస్పెండ్ అయిన ప్రధానోపాధ్యాయుల సస్పెన్షన్ ఎత్తివేయాలని తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ కోరారు.

స్పౌజ్ పాయింట్ల అంశంలో పలువురు ప్రధానోపాధ్యాయులను పూర్తిగా బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేయడం సమంజసం కాదని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టు మల్టీజోన్ స్థాయి పోస్టు అని, ఏ పాఠశాలనైనా బదిలీల్లో ఎంపిక చేసుకునే అవకాశం వారికి ఉంటుందన్నారు. హెచ్‌ఎంల సస్పెన్షన్‌ను పునఃసమీక్షించాలని ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.