15-03-2025 12:00:00 AM
జోగిపేటలో బీఆర్‌ఎస్ నిరసన
ఆందోలు, మార్చి 14 : మాజీ మంత్రి ఎమ్మెల్యే జీ. జగదీశ్వర్ రెడ్డి పై విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆదేశానుసారం శుక్రవారం జోగిపేట పట్టణంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఏఎంసి చైర్మన్ డి బి నాగభూషణం బిఆర్‌ఎస్ నాయకులు చాపల వెంకటేశం మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూని చేసి జగదీశ్వర్ రెడ్డి పై సస్పెన్షన్ విధించారనారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వేటు వేయడం సిగ్గు చేటు జగదీశ్వర్ రెడ్డి పై విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ శంకర్, దాసరి దుర్గేశ్, ఖాజా పాషా, రొయ్యల సత్యం, పరిపూర్ణం, లక్ష్మణ్, ఖలీల్, రఫిక్, బబ్లూ, నదులపుర్ మోగులయ్య, మణయ్య పాల్గొన్నారు.