calender_icon.png 19 March, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్‌లో 11 మంది ఇంజినీర్ల సస్పెన్షన్

06-07-2024 12:38:15 AM

న్యూఢిల్లీ జూలై 5: బీహార్ రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు ఆ శాఖలో పని చేసే 11 మంది ఇంజినీర్లను సస్పెండ్ చేశారు. బీహార్ రాష్ట్రంలో గత 15 రోజుల వ్యవధిలో 10 బ్రిడ్జిలు కూలిపోయాయి. ఈ ఘటనల మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉ ందని.. బీహార్ డెవలప్‌మెంట్ సెక్రటరీ చైతన్య ప్రసాద్ తెలిపారు. వంతెనలను నిర్మి ంచిన కాంట్రాక్టర్లను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

బ్రిడ్జిలు కూలేందుకు కారణం అదే: కేంద్రమంత్రి

బీహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలిపోతున్న ఘటనపై కేంద్రమంత్రి జీతన్ రామ్ మాంఝీ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది రుతుపవనాల సమ యం అందునా బీహార్‌లో వానలు దంచికొడుతున్నాయి.. అందుకోసమే బ్రిడ్జిలు కూలిపోతున్నాయని వ్యాఖ్యానించారు. కేంద్ర మ ంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఘటనలకు నితీష్ ప్రభుత్వమే బా ధ్యత వహించాలని ఆర్జేడీ డిమాండ్ చే స్తోంది. రాష్ట్రంలో ఉన్న అన్ని వంతెనలపై స ర్వే చేసి అవసరం అయిన మరమ్మతులు చే యాలని సీఎం నితీష్ అధికారులను ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.