calender_icon.png 28 November, 2024 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఈవోల సస్పెన్షన్ దారుణం

23-10-2024 02:39:07 AM

మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): డిజి టల్ క్రాప్ సర్వేకు ఒప్పుకోలేదని 150 మంది ఏఈవోలను వివిధ కారణాలతో సస్పెండ్ చేయడం దారుణమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ క్రాప్ సర్వే పేరుతో ఏఈవోలపై వేధింపులు ఆపాలని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పక్క రాష్ట్రాల్లో ఏజెన్సీలు, ఇతర శాఖల సహాయంతో సర్వే జరుగుతున్నదని చెప్పారు. తెలంగాణలో ఏఈవోల నెత్తిన రుద్దుతున్నారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో రైతులకు మేలు చేసేందుకు 5 వేల ఎకరా లకు ఒక ఏఈవోను నియమించాలని డిమాండ్ చేశారు.

డిజిటల్ క్రాప్ సర్వే కు విడుదలైన నిధులను ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారని, ఏఈవోలలో అత్యధికులు మహిళలు ఉన్నారని, క్రాప్ సర్వే పేరుతో వారిని నిర్మానుష్య వ్యవసాయ కమతాలకు ఎలాంటి రక్ష ణ లేకుండా ఎలా పంపిస్తారని, వారి భద్రతకు బాధ్యత ఎవరిదని నిలదీశా రు. వారు ఇప్పటికే 49 రకాల విధు లు నిర్వహిస్తున్నట్టు గుర్తుచేశారు.