calender_icon.png 16 March, 2025 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సస్పెన్షన్ అప్రజాస్వామికం’

15-03-2025 12:00:00 AM

కామారెడ్డి అర్బన్, మార్చి 14 ః మాజీ ప్రభుత్వ విప్, మాజీ శాసనసభ్యులు, గంప గోవర్ధన్  ఆదేశాలతో శుక్రవారం కామారెడ్డిలో బిఆర్‌ఎస్  పట్టణ శాఖ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తా లో సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి అన్నారు.

శాసనసభ సమావేశాల నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు వేయడం అప్రజా స్వామికమనీ అన్నారు. స్పష్టమైన కారణం లేకుండా జగదీశ్ రెడ్డి పై వేటు హేయమైన చర్య అని అన్నారు. రాష్ర్ట ప్రభుత్వ దుశ్చర్యను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి మాజీ ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్, టిఆర్‌ఎస్ యూత్ విభాగమ అధ్యక్షుడు చెలిమెల భాను ప్రసాద్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గట్ట గోని గోపి గౌడ్, బాలరాజ్, గెరిగంటి లక్ష్మీ నారాయణ, మల్లేష్ యాదవ్, నరేష్ రెడ్డి,గిరిని వెంకటి,రాజు, బాజా లలిత, లతారెడ్డి పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి మండలంలో..

ఎల్లారెడ్డి, మార్చ్ 14 (విజయక్రాంతి) ః అసెంబ్లి బడ్జెట్ సమావేశంలో  స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డినీ అమానుషంగా ఈ బడ్జెట్ సమావేశాలు అయ్యేవరకు సస్పెండ్ చేసినందుకు నిరసనగా సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బిఆర్‌ఎస్ నాయకులు శుక్రవారం దహనం చేశారు.  ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని స్థానిక తహసీలదార్ కార్యాలయం ఎదుట బి ఆర్ ఎస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.

ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్ మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సురేందర్  ఆదేశాలమేరకు సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు జలంధర్ రెడ్డి, ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షులు ఎగుల నర్సింలు, డి సి సి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎరుల సాయిలు, శ్రవణ్ కుమార్, సొసైటీ డైరెక్టర్ దేవదాస్, ఇమ్రాన్, బరకత్ ,కృష్ణా రెడ్డి, మల్లారెడ్డి, నాగం రాజయ్య, అరవింద్ గౌడ్, బబ్లూ, విఠల్, నాగరాజు పాల్గొన్నారు.