22-02-2025 12:44:59 AM
ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
దేవరకొండ, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి) : కొండమల్లేపల్లి సీఐ ధనుంజయ గ్పౌ సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరో పణలు, పోలీసుశాఖ అంతర్గత వ్యవహా రాలు ఉద్దేశ్యపూర్వకంగా బయటపెట్టారని ఆయనపై అభియోగాలున్నాయి. వీటిపై అంతర్గత విచారణ జరిపిన ఎస్పీ నిజమైనని నిర్ధారించడంతో మల్టీజోన్ -2 ఐజీ సత్య నారాయణ సీఐని ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
3 నెలల క్రితం గుర్రంపోడులో జరిగిన మహిళ హత్య కేసును ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు సీఐ ధనుంజయగౌడ్ ప్రయత్నించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల గుడిపల్లి మండల కేంద్రంలో జరిగిన హత్య కేసులో అనుమానితుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించగా తీవ్ర గాయాలు కావడంతో గుట్టుచప్పుడు కాకుండా దేవర కొండ ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు వార్తలొచ్చాయి.
తాజాగా పోలీస్ శాఖ అంతర్గత వ్యవహారాలను బయటపెట్టి ఓ ఆన్లైన్ పత్రిక ప్రతినిధులకు డబ్బులిచ్చి మరీ కొందరు పోలీసులపై సీఐ తప్పుడు కథనాలు రాయించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపిన శాఖపరమైన చర్యలు తీసుకున్నారు.