వేదిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఫియర్'. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందీ చిత్రం. గతేడాది డిసెంబర్ 14న థియేటర్స్ లో విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఈ చిత్రంలో జేపీ (జయప్రకాశ్), పవిత్ర లోకేశ్, అనీష్ కురువిల్ల, సాయాజీ షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 'ఫియర్' సినిమాకు ప్రైమ్ వీడియోలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులు ఈ చిత్రంపై ఆసక్తి కనబరుస్తున్నారు. 'ఫియర్' సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. దర్శకురాలు డా. హరిత గోగినేని 'ఫియర్' మూవీని రూపొందించారు. అరవిండ్ కృష్ణ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించారు. 'ఫియర్' సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డులను గెలుచుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.