చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు
సిరిసిల్ల, జనవరి 4 (విజయక్రాంతి): అక్రమంగా ఒకరు భూమిని మరొకరి పేరున రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దారును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారంసీఐ తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన సంటి లస్మవ్వకు గ్రామ శివారులో సర్వే నెంబర్ 322/4/1 లొ ఒక ఎకరం భూమి కలదన్నారు.
40 సంవత్సరాల నుండి సాగులో ఉన్న భూమి సంబందించిన రైతుబంధు డబ్బులు కూడా వచ్చాయన్నారు.గత రైతుబంధు డబ్బులు రాకపోగా, లస్మవ్వ కూతురు ప్రమీల అధికారులను సంప్రదించగా ధరణి పోర్టల్‌లో 40 గుంటలకు బదులు 06 గుంటల స్థలం మాత్రమే చూపించడంతో చందుర్తి రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేయగా..
మిగితా 34 గుంటల వ్యవసాయ భూమిని మల్యాల గ్రామానికి చెందిన గోంటి రాజానర్సుపై అప్పటి తహసీల్దార్ నరేష్ అక్రమంగా 2018- 19 లో పట్టా మార్పు చేసినట్లు గుర్తిచిందన్నారు. తన తల్లి లస్మవ్వ పేరుపై ఉన్న ఎకరం భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్న గొంటి రాజనర్సు, పట్టా మార్పు చేసిన అప్పటి తాసిల్దార్ నరేష్‌తో పాటు అధికారులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని లస్మవ్వ కూతురు సంటి ప్రమీల 27 నవంబర్ 2024న ఫిర్యాదు చేశారన్నారు.
కేసు నమోదు చేసి ఇప్పటికే మూడు కేసుల్లో ఉండి సస్పెన్షన్‌లో ఉన్న తహసీల్దార్ నరేష్‌ని అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించామన్నారు. పట్టా మార్పు చేయించుకున్న గుంటి రాజనర్సు మృతి చెందినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పట్టా చేసి, గతంలో చందుర్తి మండల తహసీల్దార్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన ఇద్దరిపై రెండు కేసులు, నరేష్‌పై మూడు కేసులు నమోదు చేశామని సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు