- నారాయణపేట డీఈవోకు వనపర్తి డీఈవోగా బాధ్యతలు
- మరో నలుగురు డీఈవోలకు స్థానచలనం
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): మధ్యా హ్న భోజనం ఫుడ్‌పాయిజన్ ఘటనలో సస్పెండ్ అయి న నారాయణపేట జిల్లా డీఈవో మహ్మద్ అబ్దుల్ ఘనీ కి ప్రభుత్వం మళ్లీ పోస్టింగ్ ఇచ్చింది. వనపర్తి జిల్లా డీఈవోగా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించారు.
నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్ కావడం, విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం ఆ జిల్లా డీఈవో అబ్దుల్ ఘనీని సస్పెండ్ చేసింది. అయితే గురువారం సస్పెండ్ చేయగా, శుక్రవా రం వనపర్తి జిల్లా డీఈవోగా అదనపు బాధ్యలప్పడించింది.
ఇక మరో నలుగురు డీఈవోలకు స్థానచలనం కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల డీఈవోగా పనిచేస్తున్న బీ.జగన్‌మోహన్‌రెడ్డిని బదిలీ చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. జనగామ జిల్లా డీఈవోగా పనిచేస్తున్న రామును బదిలీ చేసి జగిత్యాల జిల్లా డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా డీఈవో రమేశ్‌కుమార్‌ను బదిలీ చేసి నాగర్‌కర్నూల్ డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక జనగామలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎం రమేష్‌కు డీఈవోగా అదనపు బాధ్యతలప్పగించగా, నాగర్‌కర్నూల్ జిల్లా డీఈవోగా పనిచేస్తున్న గోవిందరాజులును బదిలీచేసి, నారాయణపేట డీఈవోగా పోస్టింగ్‌నిచ్చి, జోగులాంబ గద్వాల జిల్లా డీఈవోగా అదనపు బాధ్యలను అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.