- బాత్‌రూంలో స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తుంది
- బూతులు తిడుతూ.. ఇష్టం వచ్చినట్టు కొడుతుంది
- రోడ్డెక్కిన తంగళ్లపల్లి గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులు
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్12 (విజయక్రాంతి): తాము బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుంటే తమ పీఈటీ అసభ్యకరంగా వీడియోలు తీస్తుందని, బూతులు తిడుతూ, ఇష్టం వచ్చినట్టు కొడుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ఇంది రమ్మ కాలనీ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆరోపించారు. అరాచక పీఈటీని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ గురువారం విద్యార్థినులు డిమాండ్ చేశారు. గురుకులంలో పీఈటీగా విధులు నిరర్తిస్తోన్న జోష్ణ తీరును నిరసి స్తూ సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించారు.
పీఈటీ జోష్ణను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భం గా విద్యార్థులు మాట్లాడుతూ.. పీఈటీ తమ ను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ, ఎక్కడ పడితే అక్కడ కొడుతుందని ఆరోపించారు. స్నానం చేస్తుంటే బట్టలు లేకుండా వీడియోలు తీస్తూ, రక్తం వచ్చేలా కొడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రిన్సిపల్‌తోపాటు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టిం చు కోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఘట నా స్థలానికి చేరుకున్న ఎంఈవో, పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పినా నిరసన విరమించక పోవడంతో ఎంఈవో రఘుపతి అవుట్ సోర్సింగ్‌లో కొనసాగుతున్న పీఈటీ జోష్ణను విధుల నుంచి తొలగిస్తున్నట్టు తెలపడంతో నిరసన విరమించారు.
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాఠశాలను సందరించారు. పీఈటీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ రోడ్డుపై విద్యార్థు లు ఆందోళన చేయగా, కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో రమేశ్‌కుమార్ అక్కడికి చేరుకొని, విద్యార్థులతో మాట్లాడారు. వెంటనే పీఈటీని తొలగించారు. అనంతరం కలెక్టర్ విద్యాలయానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణ, ప్రిన్సిపా ల్ శకుంతలకు సూచించారు.