calender_icon.png 1 April, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ బస్టాండ్‌లో చోరీలు ఎక్కువ

30-03-2025 11:09:08 AM

నిత్యం వేలాది మంది ప్రయాణికుల రాకపోకలు 

నిరంతరం పోలీస్ సిబ్బందిని నియమించాలంటున్న ప్రయాణికులు 

వరుసగా చోరీలు జరుగుతున్న  పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయని పోలీస్ ఉన్నత అధికారులు 

ఆదివారం ఉదయం ఓ ప్రయాణికుడి నుంచి సెల్ఫోన్ చోరీ చేస్తూ పట్టుబడిన వ్యక్తి ,

పోలీస్ స్టేషన్ కు అప్పగించిన బస్టాండ్ సెక్యూరిటీ 

మహబూబ్ నగర్ (విజయ క్రాంతి): ఆ బస్టాండ్ నిత్యం ప్రయాణికులతో రద్దీ. రోజు వేలాదిమంది ఆ బస్టాండ్ కేంద్రంగా ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. అదే జడ్చర్ల బస్టాండ్(Jadcherla Bus Stand). ఈ బస్టాండ్ చోరీలకు నిలయంగా మారుతుంది. గత కొన్ని నెలల క్రితం రూ 30 లక్షల పైగా ఓ ప్రయాణికుడి బ్యాగ్ లో నుంచి చోరీకి గురైనట్లు తెలిసిన విషయమే. ఈ కేసులను పోలీసులు వేగవంతంగా విచారణ చేసి ఇతర రాష్ట్రంలో ఉన్న చోరీకి పాల్పడ్డ వ్యక్తులను సైతం అరెస్టు చేసి రికవరీ చేసిన విషయం విదితమే. ఈనెల 18వ తేదీన కూడా బస్టాండ్ లో నిజామాబాద్ జిల్లా కు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రయాణికుల నుంచి సెల్ ఫోన్లు చోరీ చేస్తూ పట్టుబడిన విషయం విధితమే. వీరిపై కూడా జడ్చర్ల పోలీసులు కేసు నమోదుచేసి ఫింగర్ ప్రింట్ ద్వారా చెక్ చేయడంతో గతంలో కూడా జైలుకు సైతం వారు వెళ్లి వచ్చినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇలా ఇటీవల కాలంలో జడ్చర్ల బస్టాండ్ లో సెల్ఫోన్ చోరీలతోపాటు నగదు చోరీలు సైతం జరుగుతున్నాయి. ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిను నిరంతరం ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సెల్ ఫోన్ చేసి చేస్తూ పట్టుబడ్డ వ్యక్తి...

ఆదివారం ఉదయం జడ్చర్ల బస్టాండ్ లోని క్యాంటీన్ లో ఓ ప్రయాణికుడు టిఫిన్ చేసేందుకు వచ్చారు. ప్రయాణికుడు టిఫిన్ చేసే క్రమంలో ఉండగా అతని నుంచి సెల్ ఫోన్ ను ఓ వ్యక్తి చోరీ చేస్తున్న దృశ్యాన్ని అక్కడ ఉన్న బస్టాండ్ సెక్యూరిటీ నరసింహులు చూశారు. నేరుగా చోరీకి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ విషయంపై సీఐ కమలాకర్ స్పందించారు. బస్టాండ్ లో నిత్యం ప్రయాణికులు త్వరగా వెల్లలనే ఆరాటంతో ఉంటారని, ఇదే అది నువ్వే చేసుకొని కొందరు వ్యక్తులు సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్నారని, పోలీస్ సిబ్బందిని కూడా బస్టాండ్ లో అందుబాటులో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. ప్రయాణికులు తమ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని, ప్రయాణికుల రాకపోకల విషయంలో కూడా వారి సామాగ్రిని భద్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఐ కమలాకర్ తెలియజేశారు. ఆదివారం సెల్ ఫోన్ చోరీకి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని పూర్తి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.