ఛత్తీస్‌గఢ్‌లో అదుపులోకి తీసుకున్న ఆర్‌పీఎఫ్ పోలీసులు
ముంబై, జనవరి 18: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను కత్తితో పొడిచిన దుండగు డు దాడి తర్వాత దాదర్‌లోని ఓ సెల్‌ఫోన్ దుకాణంలో హెడ్‌ఫోన్స్ కొన్నట్టు తెలుస్తోం ది. దాడి జరిగిన సుమారు 6 గంటల తర్వా త నిందితుడు నీలం రంగు చొక్కా ధరించి దాదర్‌లోని ఓ సెల్‌ఫోన్ దుకాణంలో ఉద యం 9 గంటల సమయంలో హెడ్‌ఫో న్స్ కొనుగోలు చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ తర్వాత నిందితుడు బాంద్రా రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్టు స్టేషన్‌లో రికార్డున దృశ్యాల ద్వారా తెలుస్తోంది.
దాడి అనంతరం నిందితుడు దాదర్‌లో షాపింగ్ చేసి అనంతరం బాంద్రా రైల్వే స్టేషన్‌లో రైలెక్కి పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. దుండగుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసిన అధికారు లు శుక్రవారం 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దుండగుడిని పట్టుకోవడం 30 పోలీ సు బృందాలు పని చేస్తున్నాయి.
అతడు ఇతనేనా..?
ముంబై పోలీసులు విడుదల చేసిన నిందితుడి ఫొటో ఆధారంగా ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ లో ఆకాశ్ కైలాశ్ కానోజియా అనే 31ఏళ్ల యువకుడిని ఆర్‌పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని.. ముంబై పోలీసులకు అప్పగి ంచారు. ఆర్‌పీఎఫ్ దుర్గ్ ఇంచార్జి సంజీవ్ సిన్హా మాట్లాడుతూ.. అనుమానితుడు జ్ఞానేశ్వరీ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నాడని ముంబై పోలీసులు తమకు సమాచారం ఇచ్చారని.. ఫొటోలను కూడా పంపించారన్నారు. ఈ క్రమంలోనే రైలు జనరల్ బోగీలో తనిఖీలు చేసి అనుమానితుడిని పట్టుకున్నట్టు చెప్పారు.
కరీనా స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు
దాడి జరిగిన రాత్రి ఏం జరిగిందనే విషయాన్ని సైఫ్ అలీఖాన్ భార్య కరీనా కపూర్‌ను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. దుండగుడు ముందుగా తమ చిన్న కుమారుడు జహంగీర్ గదికి ప్రవేశించాడనీ.. అది గమనించి ఇంట్లో పని చేసే వాళ్లు అలారం మోగించినట్టు తెలిపారు.
అప్రమత్తమైన సైఫ్ ఇంట్లోని మహిళను, జహంగీర్‌ను రక్షించడానికి దుండగుడిని అడ్డుకున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే దుండగుడు చాలా బలంగా సైఫ్‌పై కత్తితో దాడి చేసినట్టు వెల్లడించారు. అయితే దుండగుడు ఇంట్లో ఏ వస్తువునూ ఎత్తుకెళ్లలేదని నగలను కూడా అస్సలు తాకలేదని పేర్కొన్నారు.