calender_icon.png 29 December, 2024 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుష్మ కవితలు.. మన్మోహన్ ద్విపదలు

28-12-2024 03:18:55 AM

పార్లమెంట్‌లో ఒకరిపై ఒకరు ఛలోక్తులు

  • 2008లో ప్రధాని మన్మోహన్ ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష సమయ సందర్భంగా ప్రఖ్యాత కవి షహబ్ జాఫారీ రాసిన కవితలను పార్లమెంట్‌లో సుష్మా స్వరాజ్ ఉటంకించారు. 

సుష్మా స్వరాజ్: “ టాపిక్ మార్చవద్దు. సంపద ఎందుకు లూటీ చేయబడిందో చెప్పండి. దొంగల గురించి మేము ఏమీ చెప్పలేము. కానీ ఇది మీ నాయకత్వానికి సంబంధించిన ప్రశ్న” 

మన్మోహన్ సింగ్: “నేను మీ దృష్టికి తగినవాడిని కాదని నాకు తెలుసు. కానీ నా ఉద్దేశ్యాన్ని మాత్రం చూడాలి” అని ధీటుగా సమాధానమిచ్చారు. 

2013లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. 

మన్మోహన్ సింగ్: “ విధేయత అంటే ఏమిటో తెలియని వారి నుంచి మేము విధేయతను ఆశిస్తున్నాము”

సుష్మా స్వరాజ్: “ ప్రేమ ద్రోహం చేయడానికి ఒక కారణం ఉండాలి”. “ మీకు విధేయత గుర్తుండదు. మేము నమ్మకద్రోహాన్ని గుర్తుంచుకోలేము. జీవితం, మరణానికి రెండు లయలు ఉన్నాయి. మీకు ఒకటి గుర్తు లేదు. మేము మరొకటి గుర్తు పెట్టుకోము” 

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో పార్లమెంట్‌లో నాటి ప్రతిపక్ష నాయకురాలు, బీజేపీ ఎంపీ సుష్మా స్వరాజ్, ప్రధాని మన్మోహన్ సింగ్‌ల మధ్య జరిగిన జుగల్‌బందీ దేశ  ప్రజల్లో ఆసక్తిని కలిగించంది. 2008లో  జరిగిన అవిశ్వాస పరీక్ష సందర్భంగా వారిద్దరి మధ్య కవితలు, పంక్తులు, ద్విపదలు, షాయరీలతో జరిగిన సంభాషణ అందరినీ ఆకర్షించింది.

ఈ సందర్భంగా సుష్మా స్వరా జ్ కవితలతో ప్రభుత్వాన్ని విమర్శించారు. వాటికి దీటుగా మన్మోహన్ కూడా చిరునవ్వులు చిందిస్తూ ద్విపదులు, షాయరీతో సమాధానం ఇచ్చారు. దీంతో లోక్‌సభలో అధికార, ప్రతిపక్షాల సభ్యులు హర్షధ్వానా లు వ్యక్తం చేశారు.

లోక్‌సభలో వేడిగా ఉన్న  వాతావరణాన్ని ఇద్దరు నాయకులు తమ కవితలు, ఛలోక్తులతో ఆహ్లాదకరంగా మార్చారని ప్రశంసించారు. 2008 అవిశ్వా స పరీక్ష సమయంలో తమకు అనుకూలం గా ఓటు వేయడానికి కొందరు ఎంపీలకు కాంగ్రెస్ ప్రభుత్వం లంచాలు ఇచ్చిందని 2011 మార్చిలో వికీలీక్స్ కొన్ని పత్రాలు రిలీజ్ చేసింది.

దీంతో పార్లమెంట్‌లో తీవ్ర దుమారం రేగింది. మన్మోహన్  ఉర్దూ కవి అల్లామా ఇక్బాల్, గాలిబ్  రాసిన ద్విపదులను ఉటంకిస్తూ  దాడి చేశారు. ఈ సందర్భంగా సుష్మ స్వరాజ్ కూడా చిరునవ్వులు చిందిస్తూ  బషీర్ బదర్ రాసిన రెండు షాయరీలను ఉటంకిస్తూ ప్రభుత్వంపై ఎదురుదాడి చేశారు. 

సుష్మ గొప్ప పార్లమెంటేరియన్..

2019లో సుష్మా స్వరాజ్ మరణించినపుడు మన్మోహన్ సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె గొప్ప పార్లమెంటేరియన్, అసాధారణ ప్రతిభావంతురాలైన కేంద్రమంత్రి అని అభివర్ణించారు. ఆమె హఠాన్మరణం విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు.

ఆమె లోకసభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నప్పుడు ఆమెతో మాట్లాడిన సందర్భాలు తనకు అనేక జ్ఞాపకాలను మిగిల్చిందని అన్నారు.కాగా మన్మోహన్ నిష్క్రమణతో నాడు వారిద్దరి మధ్య ఉన్న సుహృద్భావ వాతావరణం నేడు సభలో లేదని పలువురు అభిప్రాయపడ్డారు. 2009 మధ్య సుష్మాస్వరాజ్ 15వ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేశారు.