క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ తుదిశ్వాస
బీహార్‌లో సుదీర్ఘకాలం కమలం పార్టీకి సేవలు
న్యూఢిల్లీ, మే 13: బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్‌కుమార్ మోదీ (72) సోమవారం కన్నుమూశారు. క్యాన్సర్త బాధపడుతున్న ఆయన కొంతకాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన చికిత్స తీసుకొంటున్నారు. తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నాయని గత నెలలో ఆయనే స్వయంగా ప్రకటించారు. అనారోగ్య వల్ల లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆయన పాల్గొనలేదు. బీహార్ రాజకీయాల్లో సుశీల్‌కుమార్‌కు ప్రత్యేక స్థానం ఉన్నది. 2005 నుంచి 2020 వరకు బీహార్ ఉపముఖ్యమంత్రిగా సేవలందించారు. 2020 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీ వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. సుశీల్‌కుమార్ మోదీ మృతిపట్ల ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర సంతాపం తెలిపారు.