calender_icon.png 15 March, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుశాంత్‌గౌడ్ చెంత ర్యాంకుల పంట

15-03-2025 12:00:00 AM

  • ఇప్పటికే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు

గ్రూప్ 3 ఫలితాల్లో 87వ ర్యాంక్ 

మెదక్, మార్చి 14(విజయక్రాంతి): క్రమశిక్షణతో కష్టపడి చదివితే ర్యాంకుల పంట పండుతుందని నిరూపించాడు మెదక్ పట్టణానికి చెందిన మంగ సుశాంత్గౌడ్. శుక్రవారం వెలువడిన గ్రూపు 3 ఫలితాల్లో 87వ ర్యాంకు సాధించాడు. మెదక్ పట్టణానికి చెందిన మంగ నారాగౌడ్, ఇందిర పుత్రుడైన సుశాంత్గౌడ్ గ్రూప్ 4లో ర్యాంకు పొంది రవాణా శాఖలో కానిస్టేబుల్గా పనిచేశాడు.

ఆ తర్వాత కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం పొందాడు. గ్రూపు 4లో ర్యాంకు సాధించి వాణిజ్య పన్నుల శాఖలో చేరారు. ప్రస్తుతం ఇదే వృత్తిలో కొనసాగుతుండగా గ్రూపు 2లో 90వ ర్యాంకుతో పాటు గ్రూపు 3 ఫలితాల్లో 87 ర్యాంక్ సాధించాడు. పట్టణానికి చెందిన సుశాంత్గౌడ్ గ్రూపు పరీక్షల్లో ర్యాంకులు సాధించడం పట్ల పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.