29-04-2025 01:21:30 AM
జైపూర్, ఏప్రిల్ 28: ఐపీఎల్ 18వ సీజన్‌లో పెను సంచలనం నమోదైంది. మంగళవారం జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ చిచ్చర పిడుగు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ సాధిం చాడు తద్వారా ఐపీఎల్లో అత్యంత వేగంగా శతకం సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
ఫలితంగా రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. తొలుత గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. గిల్ (84)రాణించాడు. అనంతరం రాజస్థాన్ 15.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. సూర్యవంశీ (101) విధ్వంసంతో రాజస్థాన్ సునాయాసంగా గెలుపొందింది.