- సెమీస్‌లో యువ భారత్
- యూఏఈపై ఘన విజయం
- అండర్ ఆసియా కప్
షార్జా: అండర్ ఆసియా కప్ టోర్నీ లో యువ భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం యూఏఈ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో యంగ్ ఇండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 44 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. ముహమ్మద్ రెయాన్ (35) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అక్షత్ రాయ్ (26) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో యుదజిత్ గుహ 3 వికెట్లు తీయగా.. చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత కుర్రాళ్లు 16.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 143 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసుకుంది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (46 బంతుల్లో 76 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), ఆయుశ్ హత్రే (51 బంతుల్లో 67 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. సెమీస్‌లో శ్రీలంకతో భారత్, పాకిస్థాన్‌తో బంగ్లాదేశ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో భారత్ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో 43 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
అయితే జపాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో దుమ్మురేపిన భారత్ 211 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకొని రేసులోకి వచ్చింది. యూఏఈతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లోనూ విజయఢంకా మోగించిన భారత్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇటీవలే జరిగిన ఐపీఎల్ మెగావేలంలో వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్షించాడు. 13 ఏళ్లకే వేలంలోకి వచ్చిన వైభవ్‌ను రాజస్థాన్ రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది.
దీంతో వేలంలో అమ్ముడుపోయిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. రూ.30 లక్షల కనీస ధరతో బరిలోకి దిగిన వైభవ్ కోసం రాజస్థాన్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. అయితే అండర్ ఆసియాకప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా మెరవని వైభవ్ భారత్ సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో తన ప్రభావం చూపించాడు. యూఏఈతో మ్యాచ్‌లో ఆరు భారీ సిక్సర్లతో అలరించాడు.