calender_icon.png 9 January, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్య ఎగ్జిట్.. శివకార్తికేయన్ ఎంట్రీ

05-01-2025 12:04:52 AM

అయలాన్, మావీరన్ చిత్ర వరుస విజయాలతో నటుడు శివకార్తికేయన్ మంచి జోష్ మీదున్నాడు. తాజాగా అమరన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఆ జోష్ రెట్టింపైంది. ప్రస్తుతం శివకార్తికేయన్ తన 23వ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు. 24, 25వ చిత్రాలకు సైతం శివకార్తికేయన్ సైన్ చేశాడు. 24వ చిత్రం సిబి చక్రవర్తి దర్శకత్వంలో చేయనుండగా.. 25వ చిత్రం మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో చేయనున్నారు.

‘పురనానూరు’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో సూర్య కథానాయకుడిగా నటించాల్సి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాలతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. తరువాత ఈ ప్రాజెక్టుకు శివకార్తికేయన్ ఓకే అయ్యారు.

ఈ సినిమాలో జయం రవి ప్రతి నాయకుడిగా నటించనున్నాడు. అదే విధంగా అధర్వ ముఖ్య పాత్ర పోషించనున్నాడు. శ్రీలీల కథానాయిక పాత్రలో నటించనుంది. ఈ చిత్రం ద్వారా శ్రీలీల కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. డాన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 1965లో జరిగే చారిత్రక కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది.