25-03-2025 12:16:26 AM
హైదరాబాద్, మార్చి 24(విజయక్రాంతి): తెలంగాణకు ఎంతో సేవ చేసిన బొమ్మగాని ధర్మభిక్షం పేరును సూర్యాపేట జిల్లాకు పెట్టాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన ఎంతోమందికి ప్రేరణగా నిలిచారన్నారు. భీమిరెడ్డి నర్సింహారెడ్డి, చుక్కా రామయ్యలాంటి అనేక మంది ప్రముఖులకు ధర్మభి క్షం ఆదర్శమన్నారు. అలాగే, రాష్ట్రానికి ఇండస్ట్రీయల్ పాలసీ అవసరమని దానిపై ప్రభు త్వం దృష్టిపెట్టాలని కోరారు. అలాగే, కొత్తకూడెంలోని ఎన్‌ఎండీసీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్ట రీ, ఎర్త్ యూనివర్సిటీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.