27-03-2025 01:45:08 AM
సూర్యాపేట, మార్చి26(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాకు ఎబొమ్మగాని ధర్మభిక్షం పేరు పెట్టాలని జిల్లా గౌడ జర్నలిస్టులు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం దర్మభిక్షం 14వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టి 3 సార్లు ఎమ్మెల్యే గా, 2సార్లు ఎంపీగా ఈ రాష్ట్రానికి ,దేశానికి కామ్రేడ్ ధర్మభిక్షం గౌడ్ ఎనలేని సేవలందించాడని,పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశాడని తులిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలకంగా పనిచే సి నిజాం నిరంకుశ పాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించడంలో ప్రముఖ పాత్ర వహించారని అన్నారు.
బొమ్మగాని ధర్మబిక్షం చేసిన సేవలకు గుర్తుగా సూర్యాపేట జిల్లాకు ఆయన పేరు పెట్టాలని గౌడ జర్నలిస్టుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఐతగాని రాంబాబు గౌడ్,రాపర్తి మహేష్ గౌడ్, గుణగంటి సురేష్ గౌడ్, తాందారపల్లి శ్రీనివాస్గౌడ్, శిగ సురేష్ గౌడ్ ,లింగాల సాయి గౌడ్, తండు నాగేందర్ గౌడ్, ఉయ్యాల నర్సయ్య గౌడ్, దోసపాటి అజయ్ గౌడ్, తండూ వెంకన్న గౌడ్ పాల్గొన్నారు.