07-04-2025 01:07:22 AM
అయోధ్యలో పులకించిపోయిన భక్తజనం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: శ్రీరామనవమిని పురస్కరించుకుని అయోధ్యలోని బాలరాముడి విగ్రహంపై ప్రత్యేక సూర్య తిలకం కనువిందు చేసింది. ఈ దృశ్యం చూసి భక్తజనం పరవశంతో పులకించిపోయారు. ఆరు నిమిషాలపాటు ఈ తిలకం దర్శనం ఇచ్చింది. ప్రతి శ్రీరామనవమి రోజు బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేలా ప్రత్యే క ఏర్పాట్లుచేశారు.
అధునాతన సాంకేతికత ‘గేర్ టీత్ మెకానిజం’ ద్వారా ఈ ఏర్పాట్లు చేశారు. 2024 శ్రీరామనవమి కి ఆలయం ప్రారంభోత్సవం కాగా.. ఇది రెండో శ్రీరామనవమి. ఇలా ప్రతి శ్రీరామననవమికి సూర్యకిరణాలు రాముడి విగ్రహం మీద ప్రసరించేలా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, సీబీఆ ర్‌ఐ శాస్త్రవేత్తలు రూపొందించారు.