19-03-2025 10:22:18 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా దేవుని సూర్యప్రసాద్ బుధవారం కామారెడ్డి కోర్టులో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు సీనియర్ న్యాయవాదులు దేవరాజ్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనే శ్రీనివాస్ రాజు గౌడ్ కామారెడ్డి మార్కెట్ కమిటీ వ్యవసాయ డైరెక్టర్ వ లపిశెట్టి లక్ష్మీరాజ్యం, దోమకొండ శ్రీనివాస్ అడ్వకేట్ కిరణ్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.