18-03-2025 12:55:14 AM
తిమ్మాపూర్, మార్చి17 (విజయక్రాంతి): తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సూర్య నర్సింగ్ హోమ్ కరీంనగర్ వారి క్లినిక్ ను డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పేదలందరికీ ఆర్థిక స్తోమత లేని వారికి ఈనెల 30 వరకు క్లినిక్ లో రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేయబడునని, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా, సర్జరీలు కూడా చేయ బడునని తెలిపారు.
క్లినిక్ లో డాక్టర్ అందు బాటులో ఉంటాడని తెలిపినారు దీనిని చుట్టుపక్కల మండలాలు వారు గ్రామాల వారు సద్విని చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సూర్య నర్సింగ్ హోమ్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మరియు హెచ్‌ఆర్ రాజకుమార్ మరియు హాస్పటల్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు