calender_icon.png 22 October, 2024 | 7:08 AM

సూర్య న్యూ లుక్

22-10-2024 12:00:00 AM

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న చిత్రం ‘కంగువ’. శివ దర్శకత్వంలో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో దిశా పటానీ కథానాయిక. బాబీ డియోల్ విలన్. కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం తాజాగా రెండో పాటను విడుదల చేశారు.

‘యోలో’ అంటూ సాగుగుతున్న ఈ పాట ప్రస్తుతం సంగీత ప్రియుల దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. ఈ గీత సాహిత్యం మొత్తం ఇంగ్లీష్‌లోనే సాగుతోంది. సూర్య ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనుండగా తాజాగా విడుదలైన పాటలో ఆయన లుక్ సరికొత్తగా ఉంది. దిశతో కలిసి హుషారుగా స్టెప్పులేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది.