calender_icon.png 18 January, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్య ప్రతాపం

28-07-2024 03:02:49 AM

  1. తొలి టీ20లో భారత్ విజయం 
  2. మెరిసిన సూర్య, పరాగ్ 
  3. నిసాంక శ్రమ వృథా 
  4. నేడు రెండో టీ20

శ్రీలంక పర్యటనను టీమిండియా విజయంతో ఆరంభించింది. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ దంచికొట్టిన వేళ.. పంత్, జైస్వాల్ మెరుపులు భారత్ భారీ స్కోరు చేసేందుకు బాటలు వేశారు. అటుపై ఛేదనలో నిసాంక మెరుపు ఇన్నింగ్స్‌తో కలవరపెట్టినప్పటికీ సరైన సమయంలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.

పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. పల్లెకెలె వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 43 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ (26 బంతుల్లో 58; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్థసెంచరీ సాధించాడు. రిషబ్ పంత్ (33 బంత్లులో 49; 6 ఫోర్లు, 1 సిక్సర్) రాణించగా.. జైస్వాల్ (21 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), గిల్ (16 బంత్లులో 34; 6 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.

లంక బౌలర్లలో మతీశా పతీరానా 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ పాతుమ్ నిసాంక (48 బంతుల్లో 79; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కుషాల్ మెండిస్ (27 బంతుల్లో 45; 7 ఫోర్లు, 1 సిక్సర్) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లతో మెరవగా.. అర్ష్‌దీప్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 నేడు జరగనుంది.

బ్యాటర్ల దూకుడు..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు గిల్, జైస్వాల్ తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. ఆరంభం నుంచే లంక బౌలర్లపై విరుచుకుపడిన ఈ ఇద్దరు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. అయితే ఒకేసారి జైస్వాల్, గిల్‌లు పెవిలియన్ చేరడంతో భారత్ కష్టాల్లో పడినట్లు అనిపించింది. ఈ దశలో కెప్టెన్ సూర్యకు జతకలిసిన పంత్ టీ20 ప్రపంచకప్ ఫామ్‌ను కంటిన్యూ చేయడంతో భారత్ భారీ స్కోరు దిశగా పరుగులు పెట్టింది. ఇన్నింగ్స్ చివర్లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినప్పటికి ఆఖర్లో అక్షర్ పటేల్ (10 నాటౌట్) వేగంగా ఆడడంతో భారత్ 200 పరుగుల మార్క్‌ను దాటింది. అనంతరం ఛేదనలో లంక ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 140 పరుగులతో గెలుపు దిశగా పయనించిన లంక ఆఖరి ఆరు ఓవర్లలో అనవసర ఒత్తిడికి గురయ్యింది. 

స్కోరు వివరాలు:

భారత్: జైస్వాల్ (సి) కుషాల్ (బి) హసరంగా 40, గిల్ (సి) ఫెర్నాండో (బి) మధుషనక 34, సూర్యకుమార్ (ఎల్బీ) పతీరానా 58, పంత్ (బి) పతీరానా 49, పాండ్యా (బి) పతీరానా 9, పరాగ్ (ఎల్బీ) పతీరానా 7, రింకూ సింగ్ (బి) ఫెర్నాండో 1, అక్షర్ (నాటౌట్) 10, అర్ష్‌దీప్ (నాటౌట్) 1,

ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం 20 ఓవర్లలో 213/7.

వికెట్ల పతనం: 74 74 153 176 192 201 206

బౌలింగ్: మధుషనక 3 ఫెర్నాండో 4 తీక్షణ 4 హసరంగ 4 మెండిస్ 1 పతీరానా 4

శ్రీలంక: నిసాంక (బి) అక్షర్ 79, మెండిస్ (సి) జైస్వాల్ (బి) అర్ష్‌దీప్ 45, పెరీరా (సి) బిష్ణోయి (బి) అక్షర్ 20, కమిందు మెండిస్ (బి) పరాగ్ 12, అసలంక (సి) జైస్వాల్ (బి) బిష్ణోయి 0, షనక (రనౌట్) 0, హసరంగా (సి) పరాగ్ (బి) అర్ష్‌దీప్ 2, తీక్షణ (బి) పరాగ్ 2, పతీరానా (సి) అక్షర్ (బి) సిరాజ్ 6, ఫెర్నాండో (నాటౌట్) 0, మధుషనక (బి) పరాగ్ 0,

ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం 19.2 ఓవర్లలో 170/10.

వికెట్ల పతనం: 84 140 149 158 160 161 163 170 170 170

బౌలింగ్: అర్ష్‌దీప్ 3 సిరాజ్ 3 అక్షర్ పటేల్ 4 బిష్ణోయి 4 పాం డ్యా 4 పరాగ్ 1.2