28-04-2025 01:19:05 AM
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా కార్తీక్ సు బ్బరాజ్ దర్శకత్వంలో రూ పొందిన చిత్రం ‘రెట్రో’. పూజా హెగ్డే కథానాయిక. సూర్య, జ్యోతిక నేతృత్వంలోని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపుది ద్దుకున్న ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రా న్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పంపిణీ చేస్తోంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “ముందుగా పహల్గాం మృతులకు నివాళులు. నేను గజిని సినిమా చూసి సూర్యతో ప్రేమలో పడిపోయా. తర్వాత ఆయన మిగతా సినిమాలన్నీ చూశా. జీవితంలో ఒక్కసారైనా ఆయ న్ను కలవాలనుకున్నా. అలాంటిదిప్పుడు ఆయనతో వేదిక పంచుకోవడం ఎప్పటికీ మరిచి పోలేను. నటుడిగా సూర్య అంటే నాకెంతో ఇష్టం.
ఆయన సినిమాల ఎంపిక మిగతా నటుల్లో స్ఫూర్తి నింపేలా ఉంటుంది. ‘రెట్రో’తో సూర్య మరో ఘన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. అగరం ఫౌండేషన్ ద్వారా సూర్య ఎందరో విద్యార్థులకు అండగా నిలబడుతున్నారు. ఆయన స్ఫూర్తితో నేనూ విద్యార్థులకు సాయం చేయాలనుకుంటున్నా” అన్నారు. హీరో సూర్య మాట్లాడుతూ.. “ముందుగా పహల్గాం మృతులకు నివాళులు. కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది.
పూజహెగ్డే నాకంటే ఎక్కువగా సినిమాను ప్రమోట్ చేస్తోంది. నాగవంశీది లక్కీ హ్యాండ్ అంటుంటారు. ఆయనతో చేతులు కలపడం సంతోషంగా ఉంది. నా తదుపరి చిత్రాన్ని నాగవంశీ నిర్మాణంలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నా. విజయ్ నా సోదరుడి లాంటివాడు. ఆయన జర్నీ నాకు గర్వంగా అనిపిస్తుంది” అన్నారు. అతిథిగా విచ్చేసిన దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “సూర్య అభిమానుల్లో నేనొక్కణ్ని. నా కాలేజ్ లైఫ్‌లో సూర్య సినిమా ఒక పాఠం లాంటిది.
‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమా కాదు, అదొక పాఠ్యపుస్తకం. అలా సూర్య ప్రతి సినిమా నుంచి ఏదోకటి నేర్చుకున్నాం. ఇప్పుడు ‘రెట్రో’తో వస్తున్నారు. సూర్య, విజయ్ బ్రదర్స్‌లా ఉన్నారు. ఇద్దరూ మల్టీస్టారర్ చేస్తే బాగుం టుంది” అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “తెలుగులో రెట్రో సినిమాను విడుదల చేసే అవకాశమిచ్చిన సూర్య నాకు ఇచ్చారు. ఆయన్ను ఈ తరహా సినిమాలో చూడాలని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు” అన్నారు. చిత్ర సహ నిర్మాత కార్తికేయన్ సంతానం, గీత రచయిత కాసర్ల శ్యామ్, నటుడు కరుణాకరన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కశ్మీర్ మనదే: దేవరకొండ
పహల్గాం ఘటనపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. ఆయన వ్యాఖ్యలు అందరి లో స్ఫూర్తిని రగిలిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘కశ్మీర్ మనదే కశ్మీర్ ప్రజలు మనవాళ్లే. మేం ఖుషి సినిమా షూటింగ్ కశ్మీర్‌లో చేశాం. అక్కడి ప్రజలు చాలా మంచివారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్థాన్‌కు ఆ దేశ ప్రజలే బుద్ధి చెబుతారు’ అన్నారు.