- పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక
- 14న ప్రజాప్రతినిధుల సంక్షేమ హాస్టళ్ల సందర్శన
- విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
- కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్లకు సంబం ధించిన దరఖాస్తుల పరిశీలన పకడ్బందీగా ఉంటుందని, పారదర్శకంగా లబ్ధి దారుల ఎంపిక ఉంటుందని రాష్ట్ర హౌసింగ్, రెవన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు, గ్రూప్ మెస్ చార్జీల పెంపు, సామాజిక సర్వే తదితర అంశాలపై బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. ఇండ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు అందాయని, వాటి పరిశీలన ప్రక్రియ ఈనెల 31 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు.
దరఖాస్తులపై ఇంటింటికి వెళ్లి సర్వే వివరా లను ఎప్పటికప్పుడు మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రతి 500 మందికి ఒక ఉద్యోగి (సర్వేయర్)ని నియమించుకోవాలని, సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులనూ భాగస్వాము లను చేయాలన్నారు. సర్వేకు ముందు రోజే గ్రామాల్లో చాటింపు వేయించాలని సూచించారు.
స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్లు ప్రణాళికలు రూపొందించుకోవచ్చన్నారు. సర్వే పారదర్శకంగా నిర్వహించాల న్నా రు. సర్వేపై నిరంతరం కలెక్టర్ల పర్యవేక్షణ ఉండాలని, సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రి య అని స్పష్టం చేశారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లు నిర్మించబోతున్నామని వెల్లడించారు.
గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఒ క్కసారైనా వసతి గృహాల్లో మెస్ చార్జీలు పెరగలేన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏ డాది లోపే 40 శాతం మెస్ ఛార్జీలు పెంచామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యా ప్తంగా 7.65 లక్షల మంది విద్యార్థులకు మంచి భోజనం అందుతున్నదని కొనియాడారు.
కలెక్టర్లు తరచూ హాస్టళ్లను తనిఖీ చేయాలని సూ చించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించాలన్నారు. ఈనెల 14న మం త్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు స్థానిక సంక్షేమ హాస్టళ్లను సందర్శిస్తారని, అక్కడే విద్యార్థులతో కలిసి సహపంక్తి భో జనం చేస్తారని ప్రకటించారు.
అలాగే రాష్ట్రం లో 99.09 శాతం సామాజిక సర్వే పూర్తయిందన్నారు. 1.16 కోట్ల కుటుంబాలకు గాను ఎ న్యూమటర్లు 1.12 కోట్ల కుటుంబాలను సర్వే చేశారని స్పష్టం చేశారు. ఈనెల 13లోపు సా మాజిక సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. 15, 16వ తేదీల్లో జరిగే గ్రూప్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.