కులగణన సర్వేలో పాల్గొనని వారికి మరోసారి అవకాశం కల్పించాలని సీపీఐ ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరా రు. ఈ సర్వే నివేదికతో ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. కులగణన సర్వేద్వా రా జనాభా లెక్కలపై ఒక క్లారిటీ వచ్చిందని పేర్కొన్నారు. ఏ సర్వే చేసినా 100 శాతం అం దులో పాల్గొనరన్నారు.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ఒకరోజు సర్వేకు.. ఇప్పుడు 50 రోజులపాటు చేసిన సర్వేకు చాలా తేడా ఉందని చెప్పారు. ఈ నివేదిక ద్వారా బీసీలకు ఎంతవరకు రిజర్వేషన్లు పెం చు తారన్న విషయం చెప్పాలని డిమాండ్‌చేశారు. సర్వే చేయించి, తీర్మానం చేస్తే సరిపోదని, జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పారు. ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించాలని సూచించారు.