హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): కులగణన సర్వే నివేది కను కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని, కేవ లం ప్రకటనతో సరిపెట్టొద్దని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశా రు. కులగణనపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాడు బీఆర్‌ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదని గుర్తుచేశారు.
ఏఐ సాయంతో జీహెచ్‌ఎంసీలో సర్వే చేయాలని ప్రభుత్వానికి సూచించారు. నాంపల్లితోపాటు ఇతర చోట్ల డబుల్ ఓటర్ కార్డులు ఉన్నాయని తెలిపారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని సూచించారు. ఎన్నికలపై వీలైనంత త్వరలో ప్రకటన చేయాలని చెప్పారు.
ప్రజల వ్యక్తిగత ఉన్నందునే సభలో పెట్టలేదు: మంత్రి శ్రీధర్‌బాబు
కులగణన సర్వే నివేదికను త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెడుతామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. సర్వే నివేదికలో ప్రజల వ్యక్తిగత సమాచారం ఉందని, ఆ సమాచారాన్ని ఇప్పుడు బహిరంగపర్చలేమని అక్బ రుద్దీన్ ప్రశ్నకు సమాధానమిచ్చారు.