వ్యవసాయ శాఖ అధికారులకు డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల విజ్ఞప్తి
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని డిసిఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు వ్యవసాయ శాఖ అధికారులను కోరారు. సోమవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి మండలంలో విస్తృత పర్యటన నిర్వహించారు. మండల పరిధిలోని నాగారం దంతలబోరా ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో దెబ్బతిన్న వరి, మిర్చి పంటలను ఆయన పరిశీలించారు. అధికారులు అలసత్వం చేయకుండా సర్వేని వేగవంతం చేసి ప్రభుత్వానికి ఖచ్చితమైన నివేదిక అందజేయాలని కోరారు. ఆయన వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, సొసైటీ డైరెక్టర్ పాపారావు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు