calender_icon.png 26 November, 2024 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వే @ 92 శాతం

26-11-2024 01:45:36 AM

  1. 1,08,89,758 నివాసాల్లో పూర్తి
  2. 13 జిల్లాలో వందశాతం నమోదు

హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే ముమ్మరంగా కొన సాగుతున్నది. ఇంటింటి సర్వేలో మొత్తం 1,17,58,491 నివాసాలకు గానూ సోమవారం వరకు 1,08, 89,758 ఇళ్ల (92.6 శాతం) నుంచి వివరాలు సేకరించారు. 13 జిల్లాల్లో వందశాతం సర్వే పూర్తి కాగా సంగారెడ్డిలో 88.1శాతం, మేడ్చల్ మల్కాజ్‌గిరి 82.3 శాతం పూర్త యింది. మిగతా 17 జిల్లాల్లో 90 శాతానికి పైగా పూర్తయింది.

జీహె చ్‌ఎంసీ పరిధిలో 25,05,517 నివా సాలకు 19,04,977 ఇండ్లల్లో పూర్త యి 76 శాతానికి చేరుకున్నది. సర్వే పూర్తయిన జిల్లాల్లో డాటా నమో దు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 12,85,871 నివాసా లకు సంబంధించి కంప్యూట రీకరణ పూర్తయింది. ఆపరేటర్లు, ఎన్యూమరేటర్లు సర్వే వివరాలను జాగ్రత్తగా డాటా ఎంట్రీ చేయాలని, సర్వే పత్రాలను భద్రంగా ఉంచా లని జిల్లా ఇంచార్జి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.