calender_icon.png 11 March, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు సమస్యలపై సర్వే

07-03-2025 12:00:00 AM

ఇబ్రహీంపట్నం విజయ క్రాంతి మార్చి 6 :  సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ లో పలు సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఎం పార్టీ మున్సిపల్ కన్వీనర్ చింతపట్ల ఎల్లేశ మాట్లాడుతూ...  మున్సిపాలిటీ లో వివిధ కాలనీలలో గాంధీ నగర్ కాలనీ, మహంకాళి కాలనీ, బి జె ఆర్ కాలనీలో పలు సమస్యలపై సర్వే నిర్వహించమని తెలిపారు.

అలాగే ముఖ్యంగా గాంధీ నగర్ కాలనీలో  ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు లేవని అలాగే మహంకాళి కాలనీలో సిసి రోడ్లు, నీటి సమస్య  చాలా తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. బి జె ఆర్  కాలనీ లో రేషన్ కార్డులు , పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్ల సమస్యలు ఉన్నాయని తెలిపారు. మున్సిపాలిటీలో వీటితో పాటు చాలా సమస్యలు ఉన్నాయని  ప్రభుత్వం వెంటనే ప్రజల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.

ప్రజా  సమస్యలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయని, పరిష్కరించాకపోతే త్వరలోనే మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపడుతమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  సిపిఎం మున్సిపల్ కమిటీ సభ్యులు ఎర్పుల వీరేశం,  చీమల ముసలయ్య పార్టీ సభ్యులు హనుమంత శివ,  మల్లెల నర్సింహా,  కాంశెట్టి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.