అమీన్పూర్,(విజయక్రాంతి): అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం పరిశీలించారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న పెద్ద చెరువును పరిశీలించి ముంపు బాధితులకు ఉన్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పర్యటించి అక్రమాల గురించి ప్రజలను అడిగి వివరాలు తీసుకున్నారు. పలు లేవట్లలో అక్రమాలు ఉన్నాయని ప్రజలు ఫిర్యాదు చేశారు. అమీన్పూర్ పెద్ద చెరుకు సంబంధించి సర్వే చేయించి పూర్తి నివేదిక తయారు చేసి మూడు నెలల్లో సమస్యను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లు, పార్కులు కబ్జా చేసినట్లు ప్రజలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని సర్వే చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అక్రమాలు చేసే అధికారులపై సైతం చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.