calender_icon.png 19 January, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడే సంక్షేమ పథకాల సర్వే పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

19-01-2025 12:14:12 AM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అందించిన నాలుగు సంక్షేమ పథకాల అమలులో భాగంగా చేపట్టిన సర్వే ఆదివారం సాయంత్రం లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్(Collector Jitesh V. Patil) అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లాలోని డి.వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పి సీఈవో, ఆర్డీవోలు, తాసిల్దార్ లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా అధికారులు కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, సర్వే పురోగతిపై అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ... సంక్షేమ పథకాల లబ్ధిదారుల సర్వే ప్రక్రియను ఆదివారం సాయంత్రం లోగా పూర్తి చేసుకుని గ్రామ సభల నిర్వహణకు సిద్ధమవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో లబ్ధిదారులు కింద మహిళలను నమోదు చేయాలని, కుటుంబంలో మహిళల యొక్క బ్యాంక్ అకౌంట్ ను నమోదు చేయాలని సూచించారు. రేషన్ కార్డ్ లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదుకు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు అన్నిటిని పరిశీలించి వాటిని కూడా గ్రామసభల్లో పొందుపరచాలని సూచించారు. అదేవిధంగా జాబితాలో లేనటువంటి అర్హులను గుర్తించి వారి యొక్క దరఖాస్తులను కూడా స్వీకరించి నిర్దేశిత ఫారంలో  పొందుపరచాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంపిక  ను తప్పకుండా పూర్తి చేయాలని, పేదలలో నిరుపేదలకు మాత్రమే లబ్ధి చేకూరేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎంపిక చేపట్టాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే లో ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలన్నారు.