calender_icon.png 23 November, 2024 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటి కుటుంబాల సర్వే పూర్తి

23-11-2024 01:00:13 AM

  1. ఎనిమిది జిల్లాల్లో నూరు శాతం పూర్తి 
  2. రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం కులగణన
  3. సర్వే విధుల్లో లక్షమందికి పైగా ఉద్యోగులు

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): సమగ్ర కుటుంబ సర్వే మరో కీలక మైలురాయిని దాటింది. శుక్రవారం నాటికి కోటికిపైగా కుటుంబాల్లో సర్వే పూర్తయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వే విజయవంతంగా సాగుతోంది.

ప్రజలందరూ స్వచ్ఛందంగా సర్వేలో భాగస్వాములు కావడంతో కులగణనలో వేగం పెరిగింది. నవంబర్ 9వ తేదీన సర్వే రెండో దేశ మొదలు కాగా.. 14 రోజుల్లో కోటి కుటుంబాల గణనను ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 కుటుంబాలు ఉండగా.. ఇప్పటివరకు 90 శాతం ఇళ్లలో సర్వే పూర్తయ్యింది. మొత్తం 33 జిల్లాల్లో శుక్రవారం నాటికి ఎనిమిది జిల్లాల్లో సర్వే పూర్తయినట్లు సర్కారు ప్రకటించింది.

ములుగు, జనగాం జిల్లాల్లో వంద శాతం పూర్తి కాగా.. నల్గొండ, మెదక్‌లో 99.9శాతం, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, గద్వాలలో 99శాతం, కామారెడ్డిలో 98.5శాతం, మంచిర్యాల, అసిఫా బాద్,  నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో 98 శాతం సర్వే జరిగింది. వేరే ప్రాంతాల్లో నివాసముంటున్న వారు, ఇండ్లకు తాళాలు వేసి ఉన్న నేపథ్యంలో.. ఈ గృహాలను మినహాయిస్తే.. జిల్లాల్లో సర్వే దాదాపు పూర్తయిం దని అధికారులు వెల్లడించారు.

సర్వే ప్రారంభమైన మొదట్లో అనుమానాలు, అపోహ లు వ్యక్తమైనప్పటికీ.. కులగణ న అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునివ్వటంతో ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమైంది.

కులగణన కోసం ఎన్యు మరేటర్లు, సూపర్‌వైజర్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లు.. వివిధ దశల్లో దాదాపు లక్ష మంది కిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో సర్వే నెమ్మదిగా సాగుతోంది.