22-04-2025 07:45:51 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని అడవి లింగాల గ్రామంలో మంగళవారం నాడు ఎల్లారెడ్డి ఎంపీడీవో ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా పక్కా ఇండ్లు లేని నిజమైన లబ్ధిదారులను గుర్తించడానికి గ్రామంలోని వీధుల్లో పర్యటించి గుడిసెలు, రేకుల షెడ్లు, అద్దె ఇల్లు, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో ప్రకాష్ మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించడానికి కృషి చేస్తుందని, పేదలందరికీ సొంత ఇంటి కల నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శంకరయ్య పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.