calender_icon.png 23 November, 2024 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ బోర్డు నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లను తొలగించాలి

03-11-2024 09:34:26 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): పోచారం మున్సిపాలిటీ పరిధిలో వక్ఫ్ బోర్డు నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లను తొలగించాలని కోరుతు పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు ఆదివారం వినతి పత్రం అందజేశారు. మున్సిపాలిటీ పరిధి పోచారం లోని సర్వే నెంబర్ 6, ఇస్మాయిల్ ఖాన్ గూడ లోని సర్వే 3 5, 6, 56, 64, 66, 67, అన్నోజిగూడ లోని సర్వే నెంబర్లు 28,92, 841, 843, 844, 145, 146, 147, 90 నుండి 100 వరకు, యంనంపేట్ లోని సర్వే నెంబర్ 17, కొర్రెముల లోని సర్వే నెంబర్లు 27, 423, 667,667, 669, 670/1,890, కాచవానిసింగారం లోని సర్వే నెంబర్ 120, ప్రతాపసింగారం సర్వే నెంబర్లు 14, 202, 202/1, 235, 281 ల లోని 64 ఎకరాల భూమి ని వక్ఫ్ బోర్డు నిషేధిత జాబితాలో చేర్చారని, వాటిని తొలగించాలని వినతి పత్రంలో కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో కౌన్సిలర్ గొంగళ్ల మహేష్, నాయకులు నర్రి కాశయ్య, బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.