calender_icon.png 9 February, 2025 | 10:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎఫ్-లైన్ దరఖాస్తుపై నిర్దిష్ట గడువులోగా సర్వే చేయాలి

09-02-2025 01:42:19 AM

సర్వే శాఖకు హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): తెలంగాణ రెవెన్యూ చట్టం, సర్వే, సరిహద్దుల చట్టాల కింద జారీ అయి న ప లు సర్క్యులర్ల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు సమర్పించిన ఎఫ్-లై న్ దరఖాస్తుపై నిర్దిష్ట గడువులోగా సర్వే పూర్తి చేయాల్సి ఉం దని హైకోర్టు పేర్కొంది.

సర్వే నిర్వహించి భూమి హద్దులను గుర్తించడానికిగాను ‘ఎఫ్-లైన్’ దరఖాస్తు చేసుకోవాల్సి ఉం టుందని, అన్ని పత్రాలను సమర్పించి తగిన ఫీజు చెల్లించిన పక్షంలో నిర్దిష్ట గడువులోగా సర్వే నిర్వహించాల్సి ఉందని తెలిపింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో రెండు వేర్వేరు సర్వే నెంబర్లలోని 2.16 ఎకరాల భూమి, 1.24 సర్వే నిమిత్తం ఎఫ్‌లైన్ దరఖాస్తు చేసినా సర్వే నిర్వహించకపోవడం తో కే రమేశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పొరుగున ఉన్న వ్యక్తితో తరచూ సరిహద్దు వివాదాలు తలెత్తుతున్నందున సర్వే నిమిత్తం దరఖాస్తు చేసినట్లు చెప్పారు. దరఖాస్తు చేసిన 45 రోజుల్లోపు సర్వే నిర్వహించాల్సి ఉందన్నా రు.

ప్రభుత్వ సహాయ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. వాదనలను విన్న న్యాయ మూర్తి ప్రైవేటు భూములకు సంబంధించి సర్వే అండ్ సెటిల్‌మెంట్ కమిషనర్ పలు సందర్భాల్లో సర్క్యులర్ల ప్రకారం గడువులోగా సర్వే నిర్వహించాలని ఆదేశిస్తూ విచారణ మూసివేశారు.