calender_icon.png 5 December, 2024 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వే డబ్బులు చెల్లించాలి

05-12-2024 01:02:31 AM

*కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆశ వర్కర్లు 

నిర్మల్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): పెండింగ్ డబ్బులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యం లో ఆశ వర్కర్లు బుధవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లా వ్యాప్తం గా పనిచేస్తున్న ఆశ వర్కర్లు.. అధికారులు, ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదు ట బైఠాయించి పెండింగ్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని నినాదా లు చేశారు.

2023 నుంచి సర్వేలకు సం బంధించిన బకాయిలను ప్రభు త్వం ఇవ్వకపోవడంపై వారు ఆగ్ర హం వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు చెల్లించాలని లేదంటే ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు పోశెట్టి, గంగామణి, ఇంద్రమాల, చంద్రకళ, మౌనిక ఉన్నారు.