03-04-2025 12:00:00 AM
మంథని ఏప్రిల్ -2 (విజయ క్రాంతి): రామగిరి మండలం లోని సింగరేణి ప్రభావిత గ్రామమైన రాజాపూర్ గ్రామానికి పలువురు అధికారులు చేరుకొని సర్వే నిర్వహిస్తున్నారు. గత శనివారం మంత్రి శ్రీధర్ బాబు కు రాజపూర్ గ్రామస్తులు సింగరేణి వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు విన్నవించ గా స్పందించిన మంత్రి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో ఫోన్ లో మాట్లాడుతూ రాజాపూర్ గ్రామం యొక్క స్థితి గతులపై పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి అందుకు సంబంధించిన ఫైలును తన వద్దకు పంపించాలని మంత్రి ఆదేశించారు.
ఈ మేరకు కలెక్టర్ మంథని ఆర్డీఓ సురేష్ కు మరియు రామగిరి తాసీల్దార్ సుమాన్ కు సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పలు విభాగాలకు చెందిన అధికారు రెవెన్యూ మరియు ఆర్ అండ్ బి మరియు ఎస్జిసి మరియు సింగరేణి అధికారుల సమక్షంలో రాజపూర్ గ్రామంలో ఇండ్లలో ఏర్పడిన పగుళ్లను పరిశీలించి ఇంటి యజమానుల పేర్లను నమోదు చేసుకున్నారు. బుధవారం వరకు 50కి పైబడి ఇండ్లను సర్వే చేసి, మిగతా ఇండ్లను పూర్తిచేసి ఏ రోజుకు ఆరోజు కలెక్టర్ కు నివేదిక ఇస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.