calender_icon.png 26 February, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వే తప్పుల తడక

13-02-2025 02:14:37 AM

ప్రభుత్వం ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నాం

హైదరాబాద్, ఫి బ్రవరి 12 (విజయక్రాంతి): కాంగ్రెస్ సర్కారు చేసిన కులగణన సర్వే తప్పుల తడకని, ఎట్టకేలకు ఈ నిజాన్ని ప్రభుత్వం  ఒప్పుకోవడాన్ని స్వా గతిస్తున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. బీసీల జనాభాను తగ్గించి తీవ్ర మానసిక వేదనకు గురి చేసినందుకు బీసీలందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సర్వేపై బీఆర్‌ఎస్‌తోపాటు బీసీ సంఘాలన్నీ అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రభుత్వం వినిపి ంచుకోలేదన్నారు. అసంపూర్తి లెక్కల ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని త ప్పుబట్టారు. రెండోసారైనా సమగ్రంగా సర్వే నిర్వహించాలని, బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. తూతూమంత్రంగా తీర్మానం చేసి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం పరిధిలోకి నెట్టి చే తులు దులుపుకుంటే ఎట్టిపరిస్థితుల్లో అం గీకరించమని స్పష్టం చేశారు.