29.82 లక్షల ఇళ్ల డేటా కూడా
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో చేపడుతు న్న కులగణన సర్వే నాటికి 95 శాతం పూర్తయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం నాటికి 1.10 కోట్ల ఇళ్లను ఎన్యూమరేటర్లు సర్వే చేశారు. ఇంకా 7,04,366 నివాసాలను సర్వే చేయాల్సి ఉంది. అలాగే, డేటా ఎంట్రీ కూడా వేగంగా సాగుతోంది. రాష్ర్టవ్యాప్తంగా ఇప్పటివరకు సేకరించిన సమాచారంలో 29,82,034 ఇండ్లకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటరీకరించారు.
ములుగు జిల్లాలో అత్యధికంగా 70.3 శాతం సమాచారాన్ని ఆన్‌లైన్ చేసి మొదటి స్థానంలో నిలిచింది. 59.8 శాతం సమాచారాన్ని కంప్యూటరీకరించి భువనగిరి జిల్లా రెండో స్థానంలో ఉంది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 80.5 శాతం సర్వే పూర్తయింది.