calender_icon.png 20 November, 2024 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వే @72%

20-11-2024 12:54:59 AM

  1. 83,64,331నివాసాల్లో వివరాలు నమోదు
  2. 98.9 శాతంతో ములుగు టాప్
  3. చివరిస్థానంలో జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 19 (విజయక్రాంతి) : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వే మంగళవారానికి 83,64,331 నివాసాల్లో పూర్తయినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 1,16,14,349 నివాసాలకు గానూ ఇప్పటివరకు 72శాతం పూర్తయిందని పేర్కొన్నారు.

సకాలంలో సర్వే పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఇప్పటివరకు 98.9 శాతం పూర్తి చేసి ములుగు ప్రథమస్థానంలో నిలువగా, 95 శాతంతో నల్గొండ, 93.3 శాతంతో జనగాం రెండు, మూడోస్థానంలో నిలిచాయి. 50.3 శాతం సర్వే పూర్తి చేసి జీహెచ్‌ఎంసీ చివరిస్థానంలో ఉన్నది. సర్వేలో 87,807మంది సిబ్బంది, 8,788 పర్యవేక్షక అధికారులు పాల్గొంటున్నారు. 

గ్రేటర్‌లో 51.82 శాతం పూర్తి

గ్రేటర్‌లో సర్వే ముమ్మరంగా సాగుతున్నట్టు జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం 1,48,278 కుటుంబాల వివరాలు నమోదు చేయ గా.. ఇప్పటివరకు 12,59,161 నివాసా ల్లో (51.82 శాతం) సర్వే చేసినట్టు తెలిపారు. సర్వేలో భాగంగా సినీనటి అమల నివాసంలో ఎన్యూమరేటర్లు కుటుంబసభ్యుల వివరాలు సేక రించారు.