calender_icon.png 19 April, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత నేరస్తులపై నిఘా పెంచాలి

18-04-2025 12:00:00 AM

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి), జిల్లాలో పాత నేరస్థులపై నిఘాను పెంచాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, రామారెడ్డి పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పోలీస్ స్టేషన్లలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదారుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.

పోలీస్ సిబ్బంది 24 గంటల పాటు పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉండాలని సూచించారు. పోలీస్ సిబ్బంది వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు. పోలీసులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని పేర్కొన్నారు. విధుల నిర్వహణలో ఆ ప్రమత్తంగా వివరించాలని తెలిపారు.